కుక్కలు చింపిన భారత దేశం-1

                             
                కుక్కలు విస్తరాకుల్లొ అన్నం తినేప్పుడు ఆ విస్తరాకుని ముక్కలు ముక్కలుగా చేసి అన్నం తింటాయి. ఈ రాజకీయ కుక్కలు భారత దేశాన్ని వాళ్ళ ఇస్టం వచ్హినట్టు చింపి ముక్కలు ముక్కలు చేస్తున్నరు.     


                ప్రపంచంలోనే రెండవ స్థానంలొ ఉంది మన పోలిస్ మరియు నిఘా వ్యవస్థ. అయినా సరే తీవ్రవాదులు యెదెచ్హగా చొరబడతారు, సంవత్సరాలుగా  ఇక్కడే కాపురం చేస్తారు, కసితీరా బాంబులు వేస్తారు, పక్కనే ఉన్న హోటల్ లోకి వెల్లి పార్టీ చేసుకుంటారు. ఒకవేళ పోలీసులకు దొరికితే పార్టీ హోటల్ నుంచి జైలుకి మారుతుంది అంతే.  కసబుగాన్ని నడిరోడ్డు మీద ప్రపంచం అంత చూస్తుండగ వాడు వాడిన గన్ తోటె, వాడు మారణ హొమం చేసిన ప్రదెశంలోనే వాన్ని కాల్చితే ఎవరికి ఇశ్టం ఉండదు?? కానీ ఉంటుంది ఎవరికి అంటే వాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చెసే నాకొడుకులకి ఉంటుంది. అదే కద ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తున్నది. రెండున్నర ఏల్లుగా ఆ నీచున్ని కాపాడుతూ వస్తుంది, దాని ఫలితమే నిన్నటి మారణహోమం. కసబ్ బర్త్ డేకి అతని సహచరులు ఇచ్హిన గిఫ్ట్ 3 బాంబులు, 30 ప్రాణాలు, 300 జీవచ్హవాలు.   


              మరి ఈ నిఘా వ్యవస్థ, ఈ పొలిసులు ఏం పీకుతున్నట్టు. ఏం పీకట్లెదా అంటే అదీ కాదు, చాలా పీకుతున్నారు, కాని ఎవరికోసం పీకుతున్నారు, ప్రజల కొసం అయితే కాదు, మరి... మన కుక్కల కోసం పీకుతున్నారు. మొన్న మన గవర్నర్ గారు తన మనవడికి సైకిల్ కొనివ్వడానికి అని కోటిలోని ఒక సైకిల్ షాపుకు సకుటుంబ సమేతంగా వెళ్ళి సైకిల్ కొని ఇచ్హాడు, ఇది అంతా బాగానే ఉంది కాని దీనికోసం ఆ రోజు ఉదయం నుండి మన నిఘా వ్యవస్థ ఈ పని మీదనే చాలా బిసీగా ఉంటుంది. ఈ సమయంలో తీవ్రవాదులు ఏమైన చెసుకోవచ్హు.    ఇక మన పొలిసులు దారి పొడవునా కిలొమీటరుకు 30 మంది చొప్పున మొత్తం 200 మంది పొలిసులను కేటాయిస్తారు. ఇలా మన రాస్ట్రంలొ రోజు ఉన్నత పదవుల్లొ ఉన్న కనీసం 200 మందికి ఇలాంటి పర్సనల్ పనులు ఉంటాయి. అలా ఈ దెశంలొ కనీసం ఒక 3000 మందికి ఇలాంటి పర్సనల్ పనులు ఉంటాయి పాపం !!!  అంటే మొత్తం నిఘా వ్యవస్థ చెమటోడ్చి వీరి కోసం కష్టపడి పని చేస్తుంది పాపం !!! ఇక తీవ్రవాదుల గురుంచి ఆలొచించే తీరిక ఏది. నేనే కనుక ఇలాంటి బాద్యత కల పదవిలో ఉంటే   నెట్ లొ ఏ సైకిల్ కావాలొ చూసి అస్సిస్టంట్ చేత తెప్పించుకునే వాడిని.    ఇప్పటి వరకు పదవిలో ఉన్న ఒక్క రాజకీయ నాయకుడు కూడ తీవ్రవాదుల చేతిలొ చనిపోలెదు.  ఇది చాలు కద మన నిఘా వ్యవస్థ ఎంత గొప్పగా పని చేస్తుందొ.   


          దేశంలొ ఏ అంతర్గత సమస్య అయిన పరిష్కరించాల్సింది రాజకీయ నాయకులే కాని వాల్లు ఆ పనిని ఎందుకు చెయడం లేదు, ఎవరి స్వార్థ ప్రయొజనాలు వారికి కావలి, మరి దీనికి పరిష్కారం ???  ఏమొ నాకైతె తెలీదు.    


ఇవన్నీ పక్కన పెడితే బాంబు బ్లాస్ట్ అయిన తరువాత కుల, మత, వర్గ తేడాలు లేకుండా ఒకరికి ఒకరు సహాయ పడిన తీరు అభినందనీయం.... Hats off to Mumbai People.....